85 సంవత్సరాల నిండిన వయోవృద్ధులు వరకు దరఖాస్తు చేసుకున్న వారు 354 మంది : కలెక్టర్
సాక్షిత : పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ సమావేశ మందిరం నందు లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ బి ఎల్ వో లు ఓటర్ స్లిప్పులను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నారని ఈనెల 28వ తేదీ వరకు స్లిప్పులు పంపిణీ చేస్తారని దీనికి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ తెలిపారు. 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఉందని ఇంటి వద్ద నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని హోం ఓటింగ్ కోసం 12D ఫాములు 6070 ఇవ్వడం జరింగిదని, ఇప్పటివరకు 354 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. హోమ్ ఓటింగ్ కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి ముందస్తు సమాచారం అందిస్తామని ఏజెంట్లు పీవోలు సమక్షంలో భద్రత మధ్య ఓటు హక్కు ఉద్యోగానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. హోమ్ ఓటింగ్ చేసుకున్న వారి వివరాలను కూడా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులకు తెలపాలని కలెక్టర్ సూచించారు. పిడబ్ల్యుడి ఓటర్స్ ఇప్పటివరకు 344 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. పి డబ్ల్యు డి ఓటర్స్ పోలింగ్ రోజు సౌకర్యాల కొరకు ముందుగా సాక్ష్యం యాప్ నందు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నాలుగు నియోజకవర్గాలలో ఈవియం స్టాంగ్ రూమ్స్ ను రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ డే మాట్లాడుతూ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కేంద్రాల లోపల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ 100% జరిగేందుకు కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారువ అలాగే నాలుగు నియోజకవర్గాలలో సంబంధించిన ఈవీఎం స్ట్రాంగ్ రూములలో కూడా గట్టి పోలీస్ బందోబస్తు 24×7, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. అన్ని చెక్‌పోస్టులలో గట్టి గా ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటివరకు 5 కోట్ల 68 లక్షల సీజర్స్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలకు లోబడి వ్యవహరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వి వి అప్పారావు, ఎన్నికల సూపర్నెంట్ శ్రీనివాసరాజు,ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నుండి చకిలం రాజేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ నుండి సవరాల సత్యనారాయణ, సిపిఎం పార్టీ నుండి కోట గోపి, బిజెపి పార్టీ నుండి ఆబిద్, బిఎస్పి నుండి స్టాలిన్, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు .