సర్కారు బడుల్లో చక్కని నాణ్యమైన విద్యా: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణ పరిధిలోని శివారెడ్డి పేట్ ZPHS పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ విద్యా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
మన బస్తీ మన బడి లో భాగంగా శివారెడ్డి పేట్ పాఠశాలలో 1.30 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు యూనిఫామ్స్, టెస్ట్ బుక్కులతో పాటు ఈ సంవత్సరం నుండి నోట్ బుక్కులు కూడా పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికీ రాగి జావ ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్యార్హత కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య బోధన విధానం ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయాన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి KCR గురుకుల పాఠశాలల సంఖ్యను పెంచుతూ… గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమంతో పాఠశాలల భవనాలకు మరమ్మత్తులు చేపట్టి మౌలిక సదుపాయాలను కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు.
అనంతరం శివారెడ్డి పేట్ లో అంగన్ వాడి భవనాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page