సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *”డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన CMRF చెక్కులు స్వయంగా ఇంటింటికి వెళ్లి అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన రూపాయలు (Rs.11,05,500/- (రూపాయలు పదకొండు లక్షల ఐదు వేల ఐదు వందలు) విలువ గల 29 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులు పంపిణి చేశారు.
అనారోగ్యానికి గురైనటువంటి పేద ప్రజలకు CMRF తో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందుతుందని, అనారోగ్యానికి గురైన పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు