తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవం

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ విద్యుత్ సంస్థల ఆధ్వర్యంలో హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని సత్యభారతి కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో డీసీ వెంకన్న, డీసీ సుధాంష్ , కార్పొరేటర్లు శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , జగదీశ్వర్ గౌడ్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ , రాగం నాగేందర్ యాదవ్ , నార్నె శ్రీనివాసరావు , శ్రీమతి రోజాదేవి రంగరావు ,విద్యుత్ అధికారులు DE గోపాలకృష్ణ ,విద్యుత్ అధికారులతో కలిసి పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి ,ప్రసంగించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ విజయోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు విద్యుత్ ప్రగతి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగినది అని, నిత్య కోతల నుండి నిరంతరం వెలుగుల ప్రస్థానం , నాటి పాలకుల హయాంలో కరెంట్ కోతలు , పవర్ హాలిడేలతో జనం అష్టకష్టాలు పడినారు అని నాడు విద్యుత్ పంపిణీ సరిగ్గా లేక వ్యవసాయం ,పరిశ్రమ రంగాలు కుదేలు అయ్యాయి అని ,జీవనోపాధి భారం అయింది అని, వలసలు పెరిగాయి అని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతలో విద్యుత్ రంగంలో కాంతులు విరజిల్లుతుంది అని, గృహ, వ్యవసాయం ,వాణిజ్య ,పరిశ్రమ సహా అన్ని రంగాలకు నిరంతర 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది అని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా ను అందచేయడం జరుగుతుంది అని, నిరంతర విద్యుత్ సరఫరతో భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది అని,కోతలు లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా తో పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ పెరిగిన ఉద్యోగ అవకాశాలు,నాణ్యమైన విద్యుత్ సరఫరా తెలంగాణ వరదాయినిలుగా కాళేశ్వరం ,పాలమూరు- రంగారెడ్డి బాహుళార్థ ఎత్తిపోతల పథకాలతో అలరిస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అని,
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించింది వందేండ్ల అభివృద్ధి ని సాధించాం అని,సంక్షేమంలో, అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి.తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. అదేవిధంగా
ఎంతో మంది అమరుల త్యాగ ఫలమే నేడు మనము అనుభవిస్తున్నాం అని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసుకున్న అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు అని అదేవిధంగా అమరుల త్యాగాల ఫలితం తో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ప్రజానీకానికి అభివృద్ధి అనే మార్క్ ను మీ ఆశీస్సులతో అభివృద్ధి మార్క్ ను చేసి చూపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత:

• 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు కాగా దేశ తలసరి విద్యుత్ వినియోగం 1255 యూనిట్లు దేశ తలసరి విద్యుత్ వినియోగం కంటే ఇది 69.40. శాతం ఎక్కువ.

• 27.49లక్షల మంది రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సౌకర్యం

• తెలంగాణ రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2014 లో 7,778 మెగావాట్లు కాగా 1 మే 2023 నాటికి 18,567 మెగావాట్లు. 2014 తో పోల్చితే 2023 నాటికి రెండు రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది.

• 23.03.2014న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 13,162 మెగావాట్లు కాగా. స్వరాష్ట్రంలో 30.03.2023 న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లు. 14.03.2023 న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం 297.89 మిలియన్ యూనిట్లు

• 2014లో వ్యవసాయరంగ సేవల పరిధిలో ఉన్న విద్యుత్తు కనెక్షన్ల సంఖ్య 19.03 లక్షలు కాగా 01.05.2013 నాటికి 27,49 లక్షలు.

• రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తు కనెక్షన్లు 2014 లో 1.11 కోట్లు కాగా 01.05.2023 నాటికి 1.78 కోట్లు

• CDP ఫండ్స్ ద్వారా విద్యుత్ కనెక్షన్లకు కొరకు గోకుల్ ప్లాట్స్ లో పది లక్షల రూపాయలను అందచేయడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page