హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపికి మరో షాక్ తగిలింది. సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేసారు.
కీలకమైన ఎన్నికల సమయంలో ఆమె బిజెపికి, పోటీకి దూరంగా వుండటంతో విజయశాంతి పార్టీ మార్పు ప్రచారం జరిగింది. ఇదే నిజమై ఆమె బిజెపికి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్లు విజయశాంతి తెలిపారు.
అయితే బిజెపికి రాజీనామా చేయడానికి పవన్ కల్యాణ్ తో పొత్తే కారణమనేలా కామెంట్స్ చేసారు రాములమ్మ. తరతరాలుగా స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన మా ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఆమోదించరని విజయశాంతి పేర్కొన్నారు.
ప్రాంతేతర పార్టీలకు అధికారాన్ని అప్పగించేందుకు తెలంగాణ బిడ్డలు అస్సలు అంగీకరించరని… అందువల్లే అనేకసార్లు అలాంటి పార్టీలను వ్యతిరేకించారని అన్నారు. కాబట్టి ప్రాంతేతర పార్టీల రాజకీయాలు తెలంగాణలో చెల్లవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.