SAKSHITHA NEWS


Venkatesh Goud who did padayatra in PJR Nagar Phase 2

పి జె ఆర్ నగర్ ఫేస్ 2 లో పాదయాత్ర చేసిన వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మ బండ పరిధిలోని పిజెఆర్ నగర్ ఫేస్ 2 లో డ్రైనేజ్ మరియు రోడ్ల సమస్యలను కాలనీవాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ పీజేఆర్ నగర్ లో జిహెచ్ఎంసి అధికారులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రైనేజీ లైన్ చిన్నగా ఉండి బస్తి వాసులు ఇబ్బంది పడుతున్నారని, నూతన డ్రైనేజీ లైన్ కోసం శాంక్షన్ పెట్టి త్వరగా నిర్మాణం చేపట్టాలని, డ్రైనేజ్ పూర్తయిన వెంటనే సీసీ రోడ్డు కూడా నిర్మించి కాలనీ వాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.

కాలనీలో కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు లేవని కాలనీ వాసులు తెలుపగా వీధి దీపాలు తక్షణమే అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. కాలనీలోని బ్లాక్ నెంబర్ 82 లో నివసిస్తున్న ఇద్దరు వికలాంగులను కార్పొరేటర్ ఆప్యాయంగా పలకరించి ఇద్దరికీ మందులు ఖర్చుల నిమిత్తం చెరో 3 వేల రూపాయలు అందించడం జరిగింది.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, అగ్రవాసు, సంగమేష్, వాలి నాగేశ్వరరావు, వాసుదేవరావు, మధులత, పుట్టం దేవి, సావిత్రి, రేణుక, సురేఖ, ఫారూఖ్, మహేష్, సాయిగౌడ్, సంతోష్, భిక్షపతి, లక్ష్మణ్, మధు, ప్రవీణ్, మొగిలయ్య ఖాన్, చారి, సలీం, సీతారామయ్య, అనిల్ కుమార్, సుధీర్, అంజలి, భాగ్యరాజ్, వెంకటేష్, శ్రీనివాస్, ఎఇ శ్రావణి, మ్యానేజర్ ఝాన్సీ, వర్క్ ఇస్పెక్టర్ రవికుమార్, సూపర్వైజర్స్ రవీందర్ రెడ్డి మరియు శివ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS