కార్పొరేట్ విద్యకి దీటుగా ప్రభుత్వ విద్య – మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి

Spread the love

చిట్యాల సాక్షిత

కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యని అందిస్తున్నారని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోగికార్ మాధవి ఆధ్వర్యంలో పట్టణంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి , వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలతో పోటీపడుతూ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం బడిబాట కార్యక్రమం తీసుకుని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

ముఖ్యంగా పిల్లలును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది కలిసి పట్టణంలోని ఇంటింటికి వెళ్లి విద్యార్థులను , వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా ప్రోత్సహించడంతోపాటుగా , విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వంవారిచే సమకూరే ప్రయోజనాలను వివరించి ప్రభుత్వ పాఠశాలలో జరిపించే విధంగా ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page