SAKSHITHA NEWS

*సాక్షిత : NH 44 జాతీయ రహదారి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
తెలంగాణ రాష్ట్రాభివృద్దికి 2.5లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. రాష్ట్రాభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.


నగర శివారు గుండ్ల పోచంపల్లి నుంచి బోయినపల్లి వరకు నిర్మాణమవుతోన్న 27కిలోమీటర్ల జాతీయ రహదారి 44 పనులను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి పరిశీలించారు.
ఈ జాతీయ రహదారి పనులను 1300 కోట్లతో ఐదు అండర్‌పాసు, నాలుగు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని, వచ్చే డిసెంబర్ 24వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అధికారులు షెడ్యూల్‌ కంటే ముందే పూర్తి చేస్తున్నారని ఇందుకు అధికారులను అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఇవే కాకుండా రాష్ట్రానికి 2.5 లక్షల కోట్లు ఇచ్చామని…రైల్వేకు 300కోట్లు ఇచ్చినట్లు ప్రహ్లాద్ జోషి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.
అనంతరం జీడిమెట్ల సరోజినీ గార్డెన్ లో జరిగిన పూర్వ మరియు సీనియర్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.


SAKSHITHA NEWS