ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం

Spread the love

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ను కేంద్రానికి పంపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కు కృతజ్ఞత మహాసభను రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పరిషత్ నుంచి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ నందు ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం అనంతరం మంత్రి మాట్లాడుతూ 70 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వము ఏ సీఎం వాల్మీకి బోయల్ని గుర్తించలేదని జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతంలో వాల్మీకి బోయలను గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నందుకు వాల్మీకి బోయలు అందరూ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలుపాలని కోరారు. కార్యక్రమంలో కర్నూల్ నగర మేయర్ బి వై రామయ్య,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్ , ఎమ్మెల్సీ మధుసూదన్ , తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page