Twotown CI, TRA PIC CI who gave awareness to those who are preparing for the posts of SSI and Constable.
ఎస్సై , కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వారికి అవగాహన కల్పించిన టూటౌన్ సీఐ,ట్రా పిక్ సీఐ.
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ వరికూటి మోహన్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కానిస్టేబుల్ మరియు ఎస్సై ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినా విద్యార్థిని , విద్యార్థులకు కొత్తగా వచ్చిన గ్రౌండ్ ఈవెంట్స్ రూల్స్ అమల్లో అవగాహన కోసం ఉదయం 9 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో సెన్సార్ టైమింగ్స్ టైపులో ఉపయోగించే విధంగా గ్రౌండ్ టెస్టుల్ని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ కి వచ్చే స్టూడెంట్స్ కి టెస్టులు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని టూటౌన్ సీఐ శ్రీధర్ గౌడ్ వచ్చి ప్రారంభించారు . ఈ టెస్టులకు గాను ఐదు జిల్లాలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మరియు ములుగు , నల్గొండ , సూర్యపేట జిల్లాల నుంచి దాదాపు 200 మంది విద్యార్థిని , విద్యార్థులు పాల్గొన్నారు . వీళ్లల్లో అమ్మాయిల్లో బెస్ట్ టైమింగా 3.13 మినిట్స్ లో టాప్ గా చేసిన ములుగు జిల్లా విద్యార్థిని సృజనాను కోచ్ త్రినాధుని మరియు డైరెక్టర్ మోహన్, సీఐ లు అంజలి , మరియు శ్రీధర్ , గోపీ అభినందించారు .
వీళ్ళందరూ ట్రిక్స్ ను ఏ విధంగా నేర్చుకోవాలో ఇంకా టైమింగ్స్ తీయాలనే కార్యక్రమాన్ని అందరూ వాళ్ళకి మెలకువలు తెలియజేయడం జరిగింది. ఎనర్జీని వేస్ట్ చేయకుండా ప్రారంభ దశలో ఏ ఎనర్జీ తో మొదలు పెట్టారో చివరి వరకు ఆ ఎనర్జీని కొనసాగించాలని దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ,
ఆహార అలవాట్లు గురించి వివరించారు . దేనికి అదేరా పడకుండా సంకల్పంతో మరియు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించాలని సూచించారు . ఎస్సై , కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అయ్యేవారకి మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ ఫిట్నెస్ దని కోసం టైం మెయింటినెన్స్ మరియు ఫుడ్ మెయింటినెన్స్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు .