SAKSHITHA NEWS

హాజరుకానున్న సిఎం, పలువురు రాష్ట్ర మంత్రులు

రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

టియుడబ్ల్యూజె (ఐజెయు) మూడవ తెలంగాణ రాష్ట్ర మహాసభలు మే నెల చివరి వారంలో ఖమ్మంలో జరగనున్నట్లు టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర మహాసభల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సమావేశం గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగింది. జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాంనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ మహాసభల నిర్వహణకు సంబంధించి ఖమ్మంజిల్లాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహాసభలు నిర్వహించడం ఖమ్మంలో ఇది మూడోసారి అని గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు సార్లు మహాసభలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మహాసభల నిర్వహణను పురస్కరించుకుని ఏప్రిల్ మొదటి -వారంలో సన్నాహాక సమావేశం నిర్వహించనున్నామని దీనికి రాష్ట్ర కమిటీ బాధ్యులు హాజరవుతారని తెలిపారు. మహాసభలలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల సాధన కోసం చర్చించడం జరుగుతుందని రాంనారాయణ తెలిపారు. ఖమ్మంజిల్లా ఎన్నో ప్రజా ఉద్యమాలతో పాటు చారిత్రిక మహాసభలకు అతిథ్యమిచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు, జర్నలిస్టులు పూర్తి సహయ సహకరాలను అందించి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్, సామినేని మురారి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కమిటీ బాధ్యులు ఎన్. వెంకట్రావు, ఖదీర్, టియుడబ్ల్యూజె (ఐజెయు) ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నాయకులు నలజాల వెంకట్రావు, శివానంద,ఎం.పాపారావు చెరుకుపల్లి శ్రీనివాస్, కూరాకుల గోపి, వై. మాధవరావు, ఎస్ కె -మోహినుద్దీన్, తాళ్లూరి మురళి, నామ పురుషోత్తం, జనార్థనాచారి, మేడి రమేష్, భవాని సింగ్, ఆలస్యం అప్పారావు, -ఏలూరి వేణుగోపాల్, కళ్యాణ్, రవికుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 28 at 5.42.35 PM

SAKSHITHA NEWS