టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు ప్రారంభం

Spread the love
TUWJ membership registration begins

టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు ప్రారంభం

  • నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రైవ్
  • రెండో వారంలో కమిటీల ఎన్నిక
  • నగర సమావేశంలో నేతల వెల్లడి
  • సాక్షిత ఖమ్మం బ్యూరో

జర్నలిస్టుల సంఘం.. టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆకుతోట ఆదినారాయణ అద్యక్షతన జరిగిన ఖమ్మం నగర యూనియన్ విస్త్రత స్థాయి సమావేశంలో కొత్త సభ్యత్వాలను చేర్పించు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ.. నేటి నుంచి ఖమ్మం జిల్లాలో సభ్యత్వ నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. జిల్లా యూనియన్ బాధ్యుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున యూనియన్ సభ్యత్వాలను స్వీకరించాలని కోరారు. ప్రతి సభ్యుడు రూ. 200 లు చెల్లించాలని సూచించారు.

సభ్యత్వ నమోదుకు పూర్తయిన తర్వాత నవంబర్ రెండో వారం నుంచి నియోజకవర్గాల వారీగా కమిటీలు ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సౌకర్యాల కోసం పాటుపడే యూనియన్ ఒక్క టీయూడబ్ల్యూజే మాత్రమే అని ఆయన పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో జర్నలిస్టులకు మరింత మేలు జరగాలంటే టీయూడబ్ల్యూజే యూనియన్ ను బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు నాయకుల చేతుల మీదుగా సభ్యత్వాలు స్వీకరించారు.


సమావేశంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, నాయకులు బొల్లం శ్రీనివాస్, వి. సాంబశివరావు, రామకృష్ణ, చిర్ర రవి, కోటేశ్వరరావు, రజనీకాంత్, రామిశెట్టి విజేత, బాలబత్తుల రాఘవా, మందాటి వెంకటరమణ, కొత్త యాకేష్, ఆడెపు ఉపేందర్, బెల్లంకొండ రాజేంద్ర ప్రసాద్, కేవీ, జగదీష్, వీడియో జర్నలిస్ట్ యూనియన్ అద్యక్షుడు చెరుకూరి నాగరాజు, ఫొటో జర్నలిస్ట్ యూనియన్ అద్యక్షుడు రాధారపు రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page