యశోద ఆసుపత్రికి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,

Spread the love
  • టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు, పొద్దుటూరు రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి,
  • రిసీవ్ చేసుకున్న, చేవెళ్ల ఎమ్మెల్యే తనయుడు, మొయినాబాద్ జడ్పిటిసి, కాలె శ్రీకాంత్
  • గత వారం రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ, సోమాజిగూడ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న, చేవెళ్ల హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాలె యాదయ్య గారిని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు, పరామర్శించడానికి రాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనయుడు మొయినాబాద్ జడ్పిటిసి కాలె శ్రీకాంత్ కేటీఆర్ గారిని రిసీవ్ చేసుకొని, తన తండ్రి ఉన్న బ్లాక్ లోకి తీసుకొని వెళ్ళాడు, ఎమ్మెల్యే ను కలిసిన కేటీఆర్, అనారోగ్యానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుని, మీరు త్వరగా కోలుకొని, ప్రజా క్షేత్రంలోకి రావాలని, కోరుకుంటున్నానని తెలియజేశారు, ఇప్పుడు నిలకడగానే ఉందని, త్వరలో ప్రజల మధ్యకు వస్తానని కేటీఆర్ తో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలియజేసినట్టు సమాచారం, పరామర్శించిన వారిలో,కేటీఆర్ గారితో పాటు పొద్దుటూరు గ్రామ రంగారెడ్డి జిల్లా మాజీ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు పొద్దుటూరు ఎంపిటిసి బొల్లారం వెంక రెడ్డి గారు ఉన్నారు. త్వరగా కోలుకొని ప్రజల మధ్యకు రావాలని తన చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు ప్రార్థిస్తున్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page