సవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలి

Spread the love

-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌తో కలిసి జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు చేపట్టవలసిన ముందస్తు చర్యలపై రెవెన్యూ, ఇర్రిగేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌, మిషన్‌ భగీరథ, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరుల లభ్యత వినియోగంపై సంబంధిత శాఖల సమన్వయంతో పటిష్ట ప్రణాళికతో పర్యవేక్షణ చేయాలన్నారు. పాలేరు, వైరా, లకారం, లంకపల్లి జలాశాయాలలో లభ్యత, వచ్చే నాలుగు నెలలకు సరిపడా కావాల్సిన నీటి లభ్యతకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. బేతుపల్లి, బోడేపూడి సుజలాంసఫలం, భగీరధ ఎన్‌ఎస్‌పి ద్వారా నీటిని సమకూర్చుకుంటే భూగర్భ జలాలు పెరగడంతో పాటు బోర్లు, బావుల్లో గ్రావిటీ పెరుగుతుందని తద్వారా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి కొరతను అదిగమించవచ్చన్నారు.

మిషన్‌ భగీరథతో పాటు ఇతర నీటి లభ్యతకు చర్యలు చేపట్టాలన్నారు. 50 శాతం గ్రౌండ్‌ వాటర్‌ను సమకూర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యుల సూచనల ప్రకారం నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని, తాగునీటి లభ్యత, వినియోగంపై సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. దనావాయి గూడెంలో ఫిల్టర్‌ బెడ్స్‌తో పాటు లకారంలో 5 ఎంల్‌డి ఫిల్టర్‌ బెడ్స్‌ ద్వారా నగరంలో సరఫరా చేయడం జరుగుతుందన్నారు.


మిషన్‌ భగీరథ ఇన్‌టేక్‌ వెల్‌ ద్వారా రోజువారి వినయోగంకు కావాల్సిన నీటి లభ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని, జలాశయాలతో పాటు గ్రామాలలో ఉన్న బోర్లను పునరుద్దరించడం జరిగిందని, రోజువారి వినియోగంకు .013 టిఎంసీ అవసరమవుతుందని ఏప్రిల్‌ 1 నాటికి 1 టింఎసి నీటిని సమకూర్చుకున్నట్లయితే వచ్చే నాలుగు నెలల వరకు సప్లయి చేసేందుకు ఇబ్బందులుండవన్నారు. కార్పోరేషన్‌ పరిధిలో 33 ఎంఎల్‌డి సప్లయి చేసే వారమని, మరో 5 ఎంఎల్‌డి పెంచడం జరిగిందని, ఇప్పటి వరకు 4 మోటార్లు రన్నవుతున్నాయని మరో మోటారును కూడా సిద్దం చేయడం జరిగిందని 5 మోటార్ల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఇర్రిగేషన్‌ శాఖ అధికారులు వివరించారు.
పోలీసు కమీషనర్‌ సునీల్‌ దత్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, శిక్షణ కలెక్టర్‌లు మయాంక్‌సింగ్‌, యువరాజ్‌, ట్రాన్స్‌కో ఎస్‌.ఈ సురేందర్‌, ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ ఆనంద్‌కుమార్‌ మిషన్‌ ఎస్‌.సదాశివకుమార్‌, భగీరథ ఇంట్రా ఇ.ఇ పుష్పలత, గ్రిడ్‌ ఇఇ వాణిశ్రీ, పబ్లిక్‌ హెల్త్‌ ఇ.ఇ రంజిత్‌కుమార్‌, మున్సిపల్‌ ఇ.ఇ కృష్ణలాల్‌, సంబంధిత శాఖల అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page