తిరుపతి పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత – కమిషనర్ అనుపమ అంజలి

Spread the love

Tirupati’s cleanliness and public health are top priorities – Commissioner Anupama Anjali

తిరుపతి పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత – కమిషనర్ అనుపమ అంజలి.


సాక్షిత : తిరుపతి నగరంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోబాటు, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు, మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 13 ప్రైమరి హెల్త్ సెంటర్లలో అన్ని రకాల వైధ్య సదుపాయాలు అందుబాటులో వుంచినట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు.

ప్రపంచ పస్ట్ ఏయిడ్ (ప్రాధమిక చికిత్స) దినోత్సవం సందర్భంగా కమిషనర్ ఓక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలకి అత్యవసరంగా అందుబాటులో ప్రధమ చికిత్సలు అందించడమే కాకుండా ప్రాధానమైన గర్భిని, ఎముకలు, కంటి వైధ్యనిపుణులు నగరంలోని అన్ని పి.హెచ్. సెంటర్లలో అందుబాటులో వున్నారన్నారు.

కరోనాపై పోరాటంలో భాగంగ ఇప్పటి వరకు 8,47,593 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు మొదటి, రెండు, బూస్టర్ డోసులను వేసినట్లు, ఇంకా వేసుకోని వారికి అన్ని హెల్త్ సెంటర్లో అందుబాటులో వుంచినట్లు కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు.

వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా వుండేందుకు నగరంలోని అన్ని విధుల్లో బ్లీచింగ్ చల్లడమైనదని, అదేవిదంగా ఆదివారం, బుధవారం మినహా దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగ్ అన్ని డివిజన్లలో హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షణలో చేయిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

కాలువలు పరిశుభ్రత అన్ని ఏరియాల్లో సమానంగా జరగాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్ కు 13మందికి తక్కువ కాకుండా వర్కర్స్ ను కేటాయించి కాలువలు శుభ్రం చేయిస్తున్నట్లు, సీల్ట్ తొలగిస్తున్నట్లు వివరించారు.

ఇంటింటి నుండి తడి,పొడి చెత్తను సేకరించి ప్రాసేసింగ్ యూనిట్లకు తరలించడం జరుగుతుందని, 102 ఆటోల ద్వారా చెత్త సేకరించడంతోబాటు, తడిపొడి చెత్త సేకరణకు మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే ప్రక్రియ నిరంతరం సాగుతున్నదని, ప్రతినెల యూజర్ చార్జీలు 40 లక్షలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

65 టన్నుల తడిచెత్తను ఎరువుగా మార్చుతున్నట్లు, మరో 53 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను సేకరించి ప్రోససింగ్ చేయడంతోబాటు, నగరంలోని హోటల్ల నుండి ఆహార వ్యర్థాలను నేరుగా సేకరించి సి.ఎన్.జి గ్యాస్ తయారు చేయడం‌ జరుగుతున్నదని కమిషనర్ వివరించారు. నగరంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరపాలక సంస్థ సేవలను ప్రజలంతా ఉపయోగించుకోవాలని కమిషనర్ అనుపమ అంజలి కోరారు.

Related Posts

You cannot copy content of this page