తిరుపతి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడాలి – “అంబులెన్స్” లకూ అవస్థలే….

Spread the love

తిరుపతి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూడాలి – “అంబులెన్స్” లకూ అవస్థలే….
సాక్షిత, తిరుపతి బ్యూరో: ఎప్పుడో 50 ఏళ్ళ నాటి రోడ్ల వెడల్పు, వేయింతలు పెరిగిన వాహనాలతో తిరుపతిలో అనుక్షణం వెంటాడుతూ ఉన్న తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు అన్ని శాఖలు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని రాయలసీమ పోరాట సమితి (ఆర్.పీ.ఎస్) కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కోరారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతి అంటేనే విఐపి లకు “అత్తగారి” ఇల్లులా మారి ఎప్పుడు పడితే అప్పుడు మంది మార్బలంతో వాలిపోతున్నారని వ్యాఖ్యానించారు.
తిరుపతి నగరంలో జరుగుతున్న తిరుమల బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్, రాయలచెరువు రోడ్డు అండర్ బ్రిడ్జ్ పనుల కారణంగా ట్రాఫిక్ చక్రబంధంలో ప్రజలు అల్లాడుతుంటే, మరోపక్క విఐపిల తాకిడితో ట్రాఫిక్ మళ్లింపు వల్ల అరగంట పట్టే ప్రయాణం రెండు గంటలు పడుతున్నదని తెలిపారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగితే క్షతగాత్రులను “అంబులెన్స్” ద్వారా ఆసుపత్రికి సకాలంలో చేరుకోలేక ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు.
ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో కిటకిటలాడే తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ప్రతినిత్యం వచ్చే విఐపి ల కారణంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సమావేశాలతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు అయ్యాయన్నారు.
తిరుపతి జిల్లా పరిధిలోని రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు దాదాపుగా ప్రతిరోజు తిరుమలకు వచ్చే కేంద్ర, రాష్ట్ర మంత్రుల బందోబస్తు, ప్రోటోకాల్ డ్యూటీ లతో తల మునకలై వీఐపీలు తిరుగు ప్రయాణం అయ్యేంతవరకు సతమతమవుతూ నగర ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నారని పేర్కొన్నారు. ప్రతినిత్యం వచ్చే విఐపి లను దృష్టిలో పెట్టుకొని తిరుపతి జిల్లా కలెక్టర్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం “ప్రత్యేకంగా ప్రోటోకాల్ విభాగాన్ని” ఏర్పాటు చేయాలని,
కేంద్ర – రాష్ట్ర మంత్రులు శ్రీవారి దర్శనానికి వస్తూ “స్వామి కార్యం స్వకార్యం” అన్నట్లుగా తిరుపతి నగరంలో సమావేశాలు పెట్టే సంస్కృతికి స్వస్తి పలకాలని నవీన్ కుమార్ రెడ్డి సూచించారు.
[4:25 pm, 29/08/2022] BEERAM TEJOMURTHY: …………………..

Related Posts

You cannot copy content of this page