SAKSHITHA NEWS

సాక్షిత : ఫుడ్ ప్రాసెసింగ్ సౌకర్యాల కొరత కారణంగా రైతులు పండించిన ఉత్పత్తులు ఎటువంటి విలువ జోడింపు లేకుండా విక్రయించడం వల్ల చాలా మంది రైతులు తమ ఉత్పత్తులపై లాభాలను కోల్పోతారని ప్రభుత్వానికి తెలియదా తెలిసినట్లుయితే దానిని పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దాదాపు 2 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పండ్ల తోటలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడం వలన ప్రాసెస్ చేసిన పండ్లు మరియు కూరగాయల వస్తువుల డిమాండ్‌కు గణనీయంగా దోహదపడగలదని ప్రభుత్వం స్థానిక స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించాలని యోచిస్తోందా అలా అయితే, దాని వివరాలు మరియు కాకపోతే, దానికి కారణాలు ఏమిటి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్నించగా అందుకు సమాధానంగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖా సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం ఇస్తూ వ్యవసాయ ఉత్పత్తుల విలువ జోడింపు మరియు ప్రాసెసింగ్‌ని నిర్ధారించడానికి, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దాని కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా సంబంధిత మౌలిక సదుపాయాల ఏర్పాటు విస్తరణ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా అమలులో ఉందని అన్నారు.

ఈ పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన, విస్తరణ కోసం పారిశ్రామికవేత్తలకు గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ రూపంలో క్రెడిట్ లింక్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ (క్యాపిటల్ సబ్సిడీ) అందిస్తుందన్నారు. ఈ పథకం కింద పండ్లు మరియు కూరగాయలతో సహా మొత్తం 11 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించబడ్డాయని తెలియజేసారు.

ప్రధాన మంత్రి అధికరీకరణ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం ద్వారా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు, అప్‌గ్రేడేషన్ కోసం మంత్రిత్వ శాఖ ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార సహాయాన్ని కూడా అందిస్తుందని ఈ పథకం కింద, ఆంధ్రప్రదేశ్‌లో సహాయం కోసం మొత్తం 3512 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఆమోదించబడ్డాయని మరో ప్రశ్నకు సమాధానంగా తెలియజేసారు.

ఈ పథకం అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ బ్రాండ్‌ల ఆహార ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడిడిందని ఈ పథకం 2021-22 నుండి 2026-27 వరకు ఆరు సంవత్సరాల వ్యవధిలో రూ. 10,900 కోట్లు. ఇప్పటివరకు, ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రాజెక్టులలో మొత్తం ₹.1387.03 కోట్ల పెట్టుబడి పెట్టబడిందని తెలియజేసారు.


SAKSHITHA NEWS