సూర్యాపేటలో ఎనిమిది కేజీల గంజాయి స్వాదినం ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

సూర్యాపేటలో ఎనిమిది కేజీల గంజాయి స్వాదినం ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

SAKSHITHA NEWS

Three persons arrested for possession of 8 kg ganja in Suryapet

[17:16, 20/06/2024] SAKSHITHA NEWS: సూర్యాపేటలో ఎనిమిది కేజీల గంజాయి స్వాదినం ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ కేసు నమోదు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రవి

8 కేజీల గంజాయి, గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక పల్సర్ బైక్ స్వాదీనం చేసుకున్న సూర్యాపేట పోలీసులు.
[17:17, 20/06/2024] SAKSHITHA NEWS: సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : కోడిదల పవన్ కుమార్,మన్నె రాహుల్ తో పాటు మరో వ్యక్తి
ఖమ్మం రోడ్డు లోని అమ్మ గార్డెన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక పల్సర్ బైక్ ను తనిఖీలో బాగంగా ఆపారు బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేశారు వారిని బైక్ తో సహా పట్టుకున్నారు. వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా దానిని తనిఖీ చేసిన పోలిసులకు బ్యాగ్ లో నాలుగు ప్యాకెట్ లలో గంజాయి దొరికింది. పట్టుబడిన వ్యక్తులను విచారించగా ఖమ్మం నుండి ట్రైన్ లో అరకు వెళ్ళి అక్కడ గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేటకు వచ్చి గంజాయి తాగే వారికి ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యం తో తీసుకొని వస్తుండగా 8 కేజీల గంజాయి తో పట్టుబడ్డారు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ CI రాజశేఖర్, పట్టణ SI లు మహేంద్రనాథ్, కుశలవ, క్రైమ్ హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణ, కరుణాకర్, సైదులు, కానిస్టేబుల్స్ ఆనంద్, మధు లను డీఎస్పీ రవి అభినందించారు.

WhatsApp Image 2024 06 20 at 15.40.04

SAKSHITHA NEWS