రక్షా బంధన్ కానుకగా గ్యాస్ ధర తగ్గించిన మోదీ కి ధన్యవాదాలు తెలిపారు..
బుధవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైయస్సార్ చౌక్ దగ్గర జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టి కృష్ణవేణి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిలిండర్ పై 200రూ, ఉజ్వల పథకం కింద వినియోగించే సిలిండర్ పై 400 రూపాయలు తగ్గియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది..
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ డికె. స్నిగ్ద రెడ్డి మాట్లాడుతూ..
నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశవ్యాప్తముగా 11 కోట్ల గ్యాస్ సిలిండర్ ఉచితముగా పేద మహిళలకు అందించారని అన్నారు.. గ్యాస్ ధర అంతర్ జాతీయముగా అధిక ధరలు ఉన్న రక్షా బంధను కానుకగా సిలిండర్ పై 200, ఉజ్వల కనెక్షన్ వాళ్లకు 400 రూపాయలు తగ్గించిన నరేంద్ర మోడీగారి కి ధన్యవాదాలు తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం కూడా సుంకాన్ని తగ్గించి పేదలను ఆదుకోవాలి అని అన్నారు .దేశములో ఎక్కడ లేని విధముగా తెలంగాణలో డీజిల్, పెట్రోలు రేట్లు ఉన్నాయి అని తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం పేద ప్రజలను దోచుకుంటుంది అని అన్నారు..