పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..

Spread the love

రూ. 19,02,204 లక్షల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన 19 మందికీ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు రూ.19,02,204 /- విలువ చేసే చెక్కులను ప్రగతి నగర్లోని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమిషనర్ రామకృష్ణ రావు ,తహసిల్దార్ ఫూల్ సింగ్, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఏనాడు ఆలోచించలేదని, ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే త‌ల్లిదండ్రులకు త‌ల‌కు మించిన భారంగా ఉండేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నిలిచిపోయారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,ఫ్లోర్ లీడర్ ,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు, ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు యువ నాయకులు మహిళా నాయకులు,ఆయా కాలనీల అసోసియేషన్ సభ్యులు,NMC అధికారులు సిబ్బంది,మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page