The start of fertilizer factory is a headache for Telangana
ఎరువుల కర్మాగార ప్రారంభం తెలంగాణకు తలమానికం
తక్కువ ధరకు ఎరువులు ఇచ్చేందుకు కృషి*
గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మద్దతు పలికిన కేసీఆర్*
తెలంగాణలో బిజెపి బలబడటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శత్రువయ్యాడు
*
సాక్షిత : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం తెలంగాణకు తలమానికం కానున్నదని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ తెలిపారు.. డికె.బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ..*
దేశంలో 5 ఎరువుల కర్మాగారాలను ప్రారంభిస్తుండగా అందులో తెలంగాణలో ఒకటి ఉందన్నారు ..రైతులకు తక్కువ ధరకు ఎరువులు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు ..యూరియా ఇతర ఎరువులు రైతులకు అందుబాటులో ఉండి సబ్సిడీపై వీటిని అందించేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని వివరించారు
.
ఎరువుల కర్మాగారంను ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు హాజరుకావాలని ఆహ్వానం ఉందని వివరించారు.. కానీ బిజెపి పై ద్వేషం పెంచుకున్న టిఆర్ఎస్ నాయకులు ఆహ్వానం లేదని చెప్పడం చూస్తుంటే అబద్దాల పట్టా పొంది ఉన్నారు..
గతంలో ప్రధానమంత్రిని కొనియాడిన కెసిఆర్ ఇప్పుడు అదే ప్రధానమంత్రిని బిజెపి పార్టీని ద్వేషిస్తున్నాడని విమర్శిస్తున్నాడని అన్నారు.. తెలంగాణలో బిజెపి పార్టీ బలంగా పుంజుకోవడం ప్రజలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పై పూర్తి నమ్మకాలు పెరిగిపోతూ ఉండడంతో కెసిఆర్ కు టిఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడం లేదన్నారు.. బిజెపి ని ప్రధానమంత్రిని కలిస్తే తమ కుర్చీ ఎక్కడ కదులుతుందోనని తమ అధికారం ఎక్కడ చేయి జారిపోతుందోనని భయం వారిలో పట్టుకుందని విమర్శించారు.
టిఆర్ఎస్ నాయకులకు అభివృద్ధి ఆలోచన లేదని ఎన్నికలలో డబ్బులు వెదజల్లాలి అధికారం కొనాలి అనే ధ్యాసే తప్ప వారికి అభివృద్ధితో పనిలేదని అన్నారు ..అభివృద్ధిపై ఆలోచన ఉంటే నరేంద్ర మోడీ ని కేంద్ర ప్రభుత్వం ను తిట్టరని వారితో మంచిగా ఉండి అభివృద్ధికి బాటలు వేసుకుంటారని అన్నారు
.
ఫామ్ హౌస్ డ్రామాలో సిట్ అధికారులు
ఫామ్ హౌస్ డ్రామాలో ఇప్పుడు సిట్ అధికారులను కూడా చేర్చారని కెసిఆర్ సిట్ అంటే సిట్ .. లేకుంటే ఉట్ అనగానే కెసిఆర్ చెప్పినట్లు ఆడుతారని విమర్శించారు ..కేసీఆర్ రాసిన విచారణ కాగితాలపై ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేసే అధికారులతో విచారణ నమ్మశక్యంగా ఉంటుందా అని ప్రశ్నించారు..
మునుగోడులో వీరితో పైసలు పంపిణీ చేయించిన కేసీఆర్ అదే వారితో ఫామ్ హౌస్ కేసు విచారణ చేయిస్తున్నాడని అన్నారు.. నయీమ్ కేసులో సిట్ వేసి ఆస్తులను ఉడ్చేశారని. .. డ్రగ్స్ కేసులో సిట్ వేసి ఏం చేశారని ప్రశ్నించారు.. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేదంటే సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ పోలీసులపై ఎవరికి నమ్మకం లేదని తేల్చి చెప్పారు.
ఎరువుల కర్మాగారం ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఈ ప్రసంగాన్ని వీక్షించేందుకు 75 నియోజకవర్గాలలో LEDలు ఏర్పాటు చేసినట్లు మరియు గద్వాల జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశామని తెలిపారు.. గద్వాలలో శాంతినగర్లలో ప్రధానమంత్రి ప్రసంగం వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిజెపి ససీనియర్ నాయకుడు నందిన్నె ప్రకాష్ రావ్, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, కౌన్సిలర్ త్యాగరాజు,డిటిడిసి నరసింహ ,రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు..