The spirit of Republic Day should be taken to the people
గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భారత స్వతంత్ర సమరయోధులకు ఘన నివాళులు
ఘనంగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షిత : ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉందని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కోదాడ మండల పరిషత్ ఆఫీస్, మహిళా మండలి, మార్కెట్ కార్యాలయం, మున్సిపాలిటీ కార్యాలయం, ఆర్డిఓ ఆఫీస్,గాంధీ పార్క్,గ్రంథాలయం, కోదాడ సొసైటీ కార్యాలయం, పబ్లిక్ క్లబ్, పలు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తదితర కార్యాలయాల్లో *ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ * జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలకు ఆయన 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతలకు ఎమ్మెల్యే నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..కుల,మత,లింగ,వర్గ వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులను కల్పిస్తూ, ప్రతీపౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలనే లక్ష్యంతో డాక్టర్ *B.R అంబేద్కర్ రూపొందించిన “భారత రాజ్యాంగం” అమలులోకి వచ్చిన సుదినం గణతంత్ర దినోత్సవం అని ఆయన అన్నారు. స్వతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందాలని మహనీయులు దేశ స్వతంత్రం కోసం పోరాడారని ఆయన గుర్తు చేశారు.
దళితులకి,బడుగు బలహీన వర్గానికి రిజర్వేషన్ కల్పించిన మహానీయుడు అంబేద్కర్ అని ఆయన అన్నారు.స్వాతంత్ర్య యోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు.
స్వాతంత్ర్య ఫలాలను అనుభవించేందుకు తోడ్పడిన గొప్ప భక్తులందరి స్మారక దినోత్సవంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. స్వాతంత్య్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం, అహింసా, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ప్రజలే స్వయం పాలకులై తమ ప్రభుత్వాలను నిర్దేశించుకునే సర్వసత్తాక సార్వభౌమాధికారం భారత దేశ ప్రధాన లక్షణమని అన్నారు. భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శిచడమే
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం యెక్క గొప్పతనమని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత పౌరుల విశ్వమానవతత్వానికి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పథానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక స్వరూపాలతో కూడిన భారత దేశం రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని ధృఢంగా కొనసాగించడం గర్వకారణమన్నారు.
భారత దేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగం అందించిన ఫెడరల్ స్ఫూర్తిని ఆది నుంచి ప్రదర్శిస్తోందని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, నాయకులు, విద్యార్థులు, కార్మికులు కర్షకులు, తదితరులు పాల్గొన్నారు.