SAKSHITHA NEWS

జిల్లాలో మంజూరు అయినా ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్.అండ్.బి, పంచాయతీరాజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ.ఈ, డీఈ లతో, టీఎస్ఎంఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులను పనుల పురోగతికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇంజనీరింగ్ వర్క్స్ సాంక్షన్ అయిన పనులు ఎన్ని, ఎన్ని పూర్తి అయ్యాయని, ఎన్ని పెండింగ్ లో ఉన్నవని అడిగి తెలుసుకున్నారు.

మంజూరు అయినా పనులన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రోగ్రెస్ ఉన్న పనులను ఫైనల్ చేయాలని అన్నారు. గ్రామాలలోని సీసీ రోడ్లు, కాలువల పనుల పై పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయని కలెక్టర్ కు అధికారులు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ పరిదిలో శాంక్షన్ అయిన పనులను ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్ పనులను పర్యవేక్షించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ ప్రగతి, పీఆర్ఇఇ ఆంజనేయులు, రహీమ్, శ్రీనివాసులు, రాజేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 19 At 6.56.48 Pm

SAKSHITHA NEWS