SAKSHITHA NEWS

హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్ డ్రైవర్ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి బీమా డబ్బులు స్వాహా చేశారని పోలీసులు వెల్లడించారు.

ఈ కుంభకోణంపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.
‘‘కొందుర్గు మండలానికి చెందిన రైతు బంధు, రైతు బీమా నిధులు దారిమళ్లాయి. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఫిర్యాదు చేశారు. 20 మంది రైతులకు సంబంధించి నకిలీ పత్రాలతో రైతు బీమా, 130 మంది పేరిట రైతుబంధు నిధుల మళ్లింపు జరిగింది. నిందితుడు తన మిత్రుడితో 7 బ్యాంకు ఖాతాలు తెరిపించాడు’’ అని సీపీ వివరించారు.

WhatsApp Image 2024 02 27 at 1.46.24 PM

SAKSHITHA NEWS