జిల్లా ఎస్పీ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు.

Spread the love

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయము లో జిల్లా ఎస్పీ శ్రీమతి డి.మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు.

ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి  ఫిర్యాదిదారులు వచ్చి జిల్లా  ఎస్పీ  కి పిర్యాదులను ఎక్కవగా  వర కట్నం వేదింపులు, సరిహద్దుల విషయములో గొడవలు, సివిల్ వివాదలపై  పిర్యాదులు  ఇచ్చినట్లు,

@తామరపు కోట గ్రామము నుండి ఒక మహిళ ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తన అత్తమములు అధిక కట్నం కొరకు వేధింపులు గురి చేస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినది

@కామరూపుకోట మండలం జలపా వారి గూడెం నుండి ఒక మహిళ ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తన భర్త మరణించిన తర్వాత అత్తమామలు ఇంటి నుంచి గెంటివేసి ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినది

@ఉంగుటూరు ఉంగుటూరు గ్రామము నుండి ఒక వ్యక్తి ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తన భార్య విదేశాలలో ఉద్యోగం నిమిత్తం వెళ్లినట్లు ఆమె యొక్క ఆరోగ్యం సరిగా లేనందున ఇండియాకి తీసుకు రావలసిందిగా ఏ జంటను కోరగా ఏజెంట్ డబ్బులు కొరకు వేధింపులు గురి చేస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినాడు

@నాయుడు గూడెం పెదపాడు మండలం నుండి ఒక వ్యక్తి ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తన కుటుంబ అవసరాలు నిమిత్తముగా మూడు లక్షల రూపాయలను వడ్డీకి తీసుకున్నట్లు డబ్బులు తీసుకునే సమయంలో కాళీ నోట్లు ఖాళీ చెక్కులను తీసుకుని డబ్బులును అధిక వడ్డీ వసూలు చేయాలని ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినాడు.

@కలిదిండి గ్రామం నుండి ఒక మహిళ ఎస్పీని స్పందన కార్యక్రమంలో కలిసి కొంతమంది వ్యక్తులు కొంత కాలం నుండి తనను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమెపై అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినది

స్పందన కార్యక్రమానికి వచ్చిన సుమారు 45 పిర్యాదులు అందినట్లు సదరు ఫిర్యాదులన్నింటి పై సత్వరమే చట్ట ప్రకారం విచారణ చేసి ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాటలాడి ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ .

జిల్లా నుండి స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్యసాయి సేవా సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో భోజన సదుపాయాలను కల్పించిన జిల్లా ఎస్పీ

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పే వారి యొక్క మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ద్వారా ఎంపికలు జరుగుతాయి తప్ప సిఫార్సులపై ఉద్యోగ అవకాశాలు ఉండవని ప్రజలు గ్రహించాలని ఈ పత్రికా ప్రకటన ద్వారా జిల్లా ఎస్పీ తెలియ చేసినారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page