వేరే రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో తిరుగుతు పిల్లలను తీసుకెళుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదు

Spread the love

తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసే వారి పై పోలీస్ సోషల్ మీడియా విభాగం నిఘా

తమ ప్రాంతంలో వీటికి సంబందించి ఏదైనా సమచారం ఉంటె లోకల్ పోలీస్ వారికి లేదా డయల్ -100 కు సమచారం అందించండి

——- జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS

గత రెండు రోజుల నుండి జిల్లా లోని పలు వాట్సప్ గ్రూప్ లలో ప్రచారం అవుతున్న అంశం వేరే రాష్ట్రాలకు చెందిన వారు మన జిల్లా లోని గ్రామాలలో, పట్టణాల్లో తిరుగుతూ చిన్న పిల్లలను ఎత్తుకెల్లుతున్నారన్న పోటోలు, వీడియోస్ పోస్టు చేస్తున్న ప్రచారం నిజం కాదని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS గారు తెలియజేశారు.

ఎక్కడో ఏ విషయం లో జరిగిన వీడియోస్, పోటో లను జిల్లా లోని పలు వాట్సప్ గ్రూప్ లలో పోస్ట్ చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేయద్దని , సోషల్ మీడియా పై పోలీస్ సోషల్ మీడియా విభాగం ప్రత్యేక నిఘా ఉంచిందన్న విషయాన్ని గమనించాలని అన్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న అంశం గురించి జిల్లా లో గ్యాంగ్ తిరుగుతున్నట్లు పోలీసులకు ఎలాంటి సమాచారం గాని, ఆధారాలు గానీ లేవు. రోజు వారిగా జిల్లా అంతటా నిరంతరం నిఘా ఉంచి గస్తీ నిర్వహిస్తున్నాము, పట్టణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్ వాహనాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచడమైనది, జిల్లాలోని కి ప్రవేశించే అన్ని రహదారులలో, పట్టణాలలో CC కెమెరాలతో నిఘా ఉంచబడినది, రాత్రి సమయాలలో స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలు పెట్రోలింగ్ వాహనాల తో పటిష్టమైన నిఘాలో ఉంచబడుతున్నవి.

సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లు నిజం కాదని వాటిని ఎవ్వరు నమ్మొద్దు, ఇలాంటివి ఏమైనా తమ గ్రామాలలో జరిగితే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ -1 00 కు కాల్ చేసి సమచారం అందిస్తే పోలీస్ వారు వాస్తవాలను విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వారు ఎవరు జిల్లాలో తిరగడం లేదు సోషల్ మీడియాలో తప్పుడు పుకార్లను పోస్ట్ చేసిన వారిపై కూడా పోలీస్ సోషల్ మీడియా విభాగం ద్వారా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related Posts

You cannot copy content of this page