నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం

Spread the love

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం

మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గురువారం ఒక్కరోజే 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు సమర్పించారు. చివరి రోజైన నేడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15న నామినేషన్లను పరిశీలించనున్నారు. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. దీంతో మునుగోడు బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారనేదానిపై ఆసక్తి నెలకొన్నది. నవంబర్‌ 3న పోలింగ్‌ జరుగనుండగా, అదేనెల 6న ఫలితాలు వెలువడనున్నాయి.

కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి భారీ జనసందోహం నడుమ గురువారం మధ్యాహ్నం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ, సీపీఎం నాయకులు, మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page