బక్షి కుంట చెరువు ను సుందర శోభిత వనం గా తీర్చిదిద్దిన Phenom people IT కంపెనీ

Spread the love

[4:55 PM, 12/19/2023] Sakshitha: బక్షి కుంట చెరువు ను సుందర శోభిత వనం గా తీర్చిదిద్దిన Phenom people IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ సంస్థ ను ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ *
[4:57 PM, 12/19/2023] Sakshitha: *సాక్షిత : బక్షి కుంట చెరువులో సుజల జలం తో కళకళ లాడుతూ చూపరులను ఆకట్టుకుఅంటున్న అపురూప దృశ్యం ,

చందానగర్ డివిజన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ లో గల బక్షి కుంట చెరువు సుందరికరణలో భాగంగా Phenom people IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపడుతున్న సుందరికరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ బక్షి కుంట చెరువు కు దశ దిశ మారినది అని, ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగినది అని, మురికి కూపంలాంటి చెరువు స్వచ్చమైన మంచి నీరు లాంటి చేరువుగా తీర్చిదిద్దాడమే ధ్యేయం గా పని చేసి నిరూపించడం జరిగినది అని ,నేడు సుజల జలం తో అపురూప దృశ్యకావ్యం గా ఆవిష్కృతమైనది అని , చెరువు కట్ట చుట్టూ చెట్లు పెంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.Phenom people IT కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా బైరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుందరికరణ చేపట్టుటకు ముందుకు రావడం చాలా అభినదించదగ్గ విషయం అని, సమాజ హితం ,సమాజ సేవ చేయడం కోసం ముందుకు రావడం చాలా గర్వించదగ్గ విషయ అని, సాఫ్ట్ వెర్ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టడం జరుగుతుంది అని,ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మెడికుంట చెరువును సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .

చెరువు ల వాకింగ్ ట్రాక్ నిర్మాణం గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .త్వరిత గతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు . చెరువు అపరిశుభ్రం వలన పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమల పెరగడం వలన స్థానికులకు ఏర్పడుతున్న ఇబ్బందులను ,అనారోగ్యాలకు గురవడం స్థానికులు పలుమార్లు ఎమ్మెల్యే కి పిర్యాదు చేయడం వలన దీనికి స్పందించిన ఎమ్మెల్యే స్థానికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడానికి చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో చెరువును శుభ్రపరిచి సుందరీకరణ చేసిన సంగతి విదితమే .అదేవిధంగా ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పడం జరిగినది , తామర పువ్వులను పెంచి కలుషితం కాకుండా చెరువును సుందరీకరిస్తామని ఎమ్మెల్యే గాంధీ చెప్పటం జరిగినది .

చెరువులను సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ,చెరువులు కలుషితం కాకుండా మరియు కబ్జాలకు గురికాకుండా చెరువులను పూర్తి స్థాయి లోసంరక్షిస్తామని , చెరువు చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ,ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని,అలాగే నియోజకవర్గం లోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో సుందరీకరిస్తామని ఎమ్మెల్యే చెప్పటం జరిగినది చెరువుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ,మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగింది .

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి చైతన్య, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్ర కాంత్ రావు , సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page