వినాయక చవితి వేడుకలలో కీలకమైన పందిళ్లుమండపాలు ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లో అనుమతి తప్పనిసరి

Spread the love

ప్రకాశం జిల్లా. తేది:12.09.2023

వినాయక చవితి వేడుకలలో కీలకమైన పందిళ్లు/మండపాలు ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లో అనుమతి తప్పనిసరి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ IPS

రానున్న వినాయక చవితి వేడుకలు సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు తెలియజేసిన జిల్లా ఎస్పీ

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి.

పంచాయతీ/మున్సిపాలిటీ/ నగర పాలక సంస్థ లేదా ప్రయివేట్ స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత స్థల యజమాని లేదా సంబంధిత విభాగపు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పోలీస్ అనుమతి లేకుండా విగ్రహలు ఏర్పాట్లు చేయరాదు.

వీటితో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆయా విభాగాలు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు/మండపాలు వద్ద ముందస్తుగా ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకోవాలి.

పందిళ్లు/మండపాలలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలి.

Related Posts

You cannot copy content of this page