- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
చిట్యాల మండలం:
భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్దే నా ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(మంగళవారం) చిట్యాల మండలంలోని కొత్తపేట గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో జీపీ బిల్డింగ్ కు సుమారు రూ.20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన జీపీ భవనాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రామ సర్పంచ్ గజ్జి రవి, డీపీఓ ఆశాలత, పీఆర్ ఈఈ దిలీప్, మండల పార్టీ ప్రెసిడెంట్ గూట్ల తిరుపతి, జడ్పిటిసి గొర్రె సాగర్, సర్పంచ్ ల ఫోరం మండల ప్రెసిడెంట్ కామిడి రత్నాకర్ రెడ్డి, గ్రామ సెక్రటరీ అనిత తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.