కార్యాలయాల ఫైళ్ల నిర్వహణ ఈ-ఆఫీస్ లోనే చేపట్టాలని, మాన్యువల్ ఫైళ్లను అంగీకరించేది లేదు.

Spread the love
  • జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం బ్యూరో చీఫ్,

కార్యాలయాల ఫైళ్ల నిర్వహణ ఈ-ఆఫీస్ లోనే చేపట్టాలని, మాన్యువల్ ఫైళ్లను అంగీకరించేది లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఫైళ్ల నిర్వహణ, పాత రికార్డుల పై చర్యలు, ఈ-ఆఫీస్, పాత కార్యాలయాల ఖాళీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యాలయ ఫైళ్ల నిర్వహణ ఈ-ఆఫీస్ ద్వారా చేపట్టాలని, కాగిత రహిత ఫైళ్ళతో భద్రతనే కాక, రికార్డు మార్పు చేయడానికి ఆస్కారం ఉండదని అన్నారు. కొన్ని శాఖల వారు కలెక్టరేట్ కి సమర్పించే ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారా, మిగతా ఫైళ్లు మాన్యువల్ గా నిర్వహిస్తున్నారని, ఇలాకాక, అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ద్వారానే చేపట్టాలని ఆయన తెలిపారు. పాత ఫైళ్ల నిర్వహణ విషయంలో ఫైళ్లను విషయాన్ని బట్టి ఎల్డిస్, డీడీస్, ఆర్డిస్ గా విభజించి సమయానుసారం భద్రత, ఖండనం నకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

స్వంత భవనాలు కలిగిన కార్యాలయాలు, ఐడిఓసి కి తరలిన నేపధ్యంలో, వారి పాత భవనాలు, ఇతర కార్యాలయాలకు కేటాయింపు చేసినందునందున, ఆయా కార్యాలయాలు ఖాళీ చేసిన భవనాల్లో కేటాయించిన శాఖలు వెంటనే స్వాధీనం చేసుకొని, కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జీవో 58, 59 లపై ప్రత్యేక శిబిరాలు నిర్వేహించి, దరఖాస్తుల సేకరణ చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న డొంకలు, వ్యవసాయ క్షేత్రాల రహదారులపై నివేదిక సమర్పించాలని ఆయన అన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుండి మండలాలకు సంబంధించిన రికార్డులు ఇంకనూ ఉంటే, పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టరేట్ కు సంబంధించి రికార్డు ను పూర్తి స్థాయిలో ఐడిఓసి కి తరలించాలన్నారు. ఫర్నీచర్, కంప్యూటర్లు పనికిరానివి ఉన్నచో ఖండనం కు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. మామిడి పండ్లు కార్బైడ్ ద్వారా మగ్గబెట్టు అవకాశాలు ఉన్నందున నిరంతర తనిఖీలు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page