The leadership of the late Srihari Yadav who raised the issues of the shepherds
గొఱ్ఱెల కాపరుల సమస్యలు విన్నవించిన పోచబోయిన శ్రీహరి యాదవ్ నాయకత్వం లోని రాష్ట్ర బృందం
సానుకూలంగా స్పందించి దశలవారీగా పరిష్కరిస్తామన్న మంత్రి హరీష్ రావు
గొఱ్ఱెల కాపర్ల సంక్షేమ సంఘం (GKSS )రాష్ట్ర అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ తన్నీరు హరీష్ రావు ని హైదరాబాద్ లోని వారి నివాసం లో కలవడం జరిగింది.. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు మరియు కురుమలు గొఱ్ఱెల కాపరులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్తూ వినతి పత్రాన్ని సమర్పిస్తూ రానున్న బడ్జెట్లో గొల్ల కురుమల యొక్క పాత్ర ఉండేలాగా బడ్జెట్ను తీర్చిదిద్దాలని వారికి విన్నవించడం జరిగింది…
విన్నవించిన సమస్యలలో తెలంగాణ రాష్ట్ర మంతట 75% గొఱ్ఱెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీ రూపంలో ఇవ్వాలని,గతంలో ఎన్సీడీసీ లో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, తనఖాపడ్డ ఆస్తులను విడిపించాలని లేదా వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలను కట్టే విధంగా అవకాశం ఇవ్వాలని, రాష్ట్రంలో రెండు మండలాలకు ఒకటి చొప్పున గొఱ్ఱెల మేకల మార్కెట్లను ఏర్పాటు చేస్తూ, ఒక్కొక్క మార్కెట్ కు ఐదు కోట్ల రూపాయల నిధులను కేటాయించి నిర్మాణాలను చేపట్టాలని, గొఱ్ఱెల కాపర్లు ప్రమాదవశాత్తు చనిపోతే ఇచ్చేటటువంటి ఎక్స్గ్రేషన్ 5 లక్షల రూపాయలు వెంటనే అమలుపరచాలని,తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండి ఆసక్తి కలిగిన ప్రతి గొల్ల కురుమ యువతకు పథకంలో భాగస్తులను చేయాలని, విన్నవించడం జరిగింది.
. దానికి మంత్రిగారు స్పందిస్తూ ఎక్స్ గ్రేషియా కు సంబంధించినటువంటి ఐదు లక్షల రూపాయలను ఈ బడ్జెట్ సెషన్ లోనే అమలుపరుస్తామని, గొఱ్ఱెల మరియు మేకల మార్కెట్లకు సంబంధించి సుమారు 100 కోట్లను కేటాయించి మీట్ ప్రాసెసింగ్ యూనిట్లను, మార్కెట్ల నిర్మాణాలనుదశలవారీగా చేపడతామని, ఎన్సీడీసీకి సంబంధించి మాఫీ లేదా ఎన్సిడిసిలో తీసుకున్న లోన్ సబ్సిడీ అమలుపరుస్తూ ప్రిన్సిపుల్ ఎమౌంటును కట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
యాదవులు కురుమల ఎడల తెలంగాణ ప్రభుత్వం చూపెడుతున్న ప్రేమను మేము ఎంతో అభిమానిస్తున్నామని ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచి వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి సంఘ నాయకులు అందరూ వారికి ప్రత్యేక అభివందనములు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ తో పాటు,
యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గుండెబోయిన అయోధ్య యాదవ్, సిద్దిపేట జిల్లా పాతుకుల వెంకటేశం యాదవ్,కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కాల్వ మల్లేశం యాదవ్, దేశబోయిన సూర్య నారాయణ యాదవ్ యాదాద్రి భువనగిరి జిల్లా, రాష్ట్ర నాయకులు శిలారపు పర్వతాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు