The largest fair is the Edupayala fair
మెదక్: తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా ఏడుపాయల జాతర జరుగుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కృషి చేస్తున్నారు.
జాతర నిర్వహణకు ప్రతి ఏడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడు మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో జరుగు జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ . రెండు కోట్లు మంజూరు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పండుగలు, జాతరలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. ఏడుపాయల జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని అన్నారు.
జాతరలో భక్తులకు మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రెండు కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, సహకరించిన జిల్లా మంత్రి హరీష్ రావుకి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.