ఘనంగా TBGKS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Spread the love

ఘనంగా TBGKS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆర్జీ-2 పరిదిలోని మైన్స్ మీద జెండా ఆవిష్కరిచిన బి.ఆర్.ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి.

ఆర్జీ-2 పరిధిలోని ఓసిపి-3 కృషిభవన్ మరియు బేస్ వర్క్ షాప్ లలో TBGKS నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బి.ఆర్.ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి గారిని ఆహ్వనించగా, కార్యక్రమంలో పాల్గోని జెడాని అవిష్కరించడం జరిగింది.
ఈ సంధర్బంగా సంధ్యారాణి మాట్లాడుతూ..
తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం ఎర్పడి 20 సంవత్సరములు పూర్తి చేసుకొని 21 వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిలో అహర్నిశలూ శ్రమిస్తూ, దేశానికి వెలుగులు పంచుతున్న బొగ్గు గని కార్మిక సోదరులకు ఈ సందర్బంగా ‘TBGKS’ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే TBGKS ను ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు’ తెలియజేసారు.
కార్మికుల శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా 60కి పైగా హక్కులను గౌరవ TBGKS అధ్యక్షులు కల్వకుంట్ల కవిత గారి నేత్రుత్వంలో సాధించడం జరిగిందన్నారు.
కార్మిక సంక్షేమమే దేయంగా మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కార్మికులకు అండగా ఉంటూ సింగరేణి సంస్థను అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.
అనంతరం కార్మికులకు నూతన సంవత్సర క్యాలెండర్స్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లెవన్ మెన్ కమిటి మెంబర్ కొత్త సత్యనారాయణ రెడ్డి గారు,పిట్ సెక్రేటరీ కొంగర రవిందర్, బ్రాంచ్ సెక్రటరీ సిరంగి శ్రీనివాస్ గారు, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ జగన్ బాబు,అసిస్టెంట్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి గారు , ఎల్కలపెల్లి సదయ్య,ఎస్ రాములు,బి.నర్సయ్య,ఐలయ్య,వాహేద్,భీముని సత్యనారాయణ,బి.వి రమణ,విజయ్ మరియు సింగరేణి కార్మికులు పాల్గోన్నారు.


Spread the love

Related Posts

You cannot copy content of this page

virupaksha -వీరుపాక్ష SAKSHITHA NEWS LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్