విజయానికి మూల సూత్రం నమ్మకమే

Spread the love

The key to success is trust

విజయానికి మూల సూత్రం నమ్మకమే
ఏరీస్ అగ్రో లిమిటెడ్ కంపెనీ

53 ఏళ్లుగా రైతుసేవలో ఏరీస్ అగ్రో లిమిటెడ్

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఏ సంస్థ విజయం సాధించా లన్న ప్రధానంగా నమ్మకమే విజయానికి తార్కాణమని ఏరీస్ అగ్రో లిమిటెడ్ కంపెనీ బాధ్యులు ఎం. కృష్ణమూర్తి, ఎన్. బాబూరావు తెలిపారు. ఆదివారం. 53 ఏళ్లుగా రైతుసేవలో మన ఏరీస్ అందిస్తున్న సలహాలు, సూచ నలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్,

జీవన సంధ్య వృద్ధాశ్రమం, అయ్యప్ప దేవస్థానంలో అన్న దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరీస్ కంపెనీ యాజమాన్యం మాట్లాడుతూ. 53 ఏళ్లు పూర్తి చేసుకుని 54వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

నమ్మకం, నాణ్యత, విలువలు, విశ్వాసం, ధృడ సంకల్పం ఐక్యత కాలానికి అనుగుణంగా సంస్థను విజయ తీరాల వైపు ఎదగడానికి మూల స్తంభాలుగా నిలిచాయన్నారు. ప్రస్తుత పంట యొక్క పరిస్థితుల గురించి తెలుసుకుని రైతులకు సలహాలు, సూచనలు అంది తెలంగాణ ప్రతి తం గ్రామమసాల స్తున్నామని తెలిపారు.

తమ సేవలను ప్రతి రైతు వినియోగించుకునే విధంగా తమ వంతుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ బాధ్యులు ఏస్ కే అన్వర్ పాషా, కంపెనీ ప్రతినిధులు, అన్నం ఫౌండేషన్ నిర్వహకులు అన్నం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page