సాక్షిత: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్‌కు భారీ ఊరట లభించింది. లోకేష్‌పై స్కిల్ స్కామ్ కేసును క్లోజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. కేసులో లోకేష్‌ను ముద్దాయిగా చూపలేదని కోర్టుకు తెలిపింది సీఐడీ. ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపింది సీఐడీ. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత కేసును క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది హైకోర్టు ధర్మాసనం. అయితే, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దంటూ గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు రాగా.. సీఐడీ ఇచ్చిన సమాధానం విని, కేసును క్లోజ్ చేసింది ధర్మాసనం.
స్కిల్ స్కామ్‌లో నారా లోకేష్‌కు భారీ ఊరట..కేసును కొట్టేసిన హైకోర్టు..
Related Posts
ఏపీలో 16.82 లక్షల ఉచిత సిలిండర్ల బుకింగ్
SAKSHITHA NEWS ఏపీలో 16.82 లక్షల ఉచిత సిలిండర్ల బుకింగ్ ఏపీలో గత నెల 29న ప్రారంభమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి మంచి స్పందన లభిస్తోంది. నిన్నటివరకు 16.82 లక్షల మంది బుక్ చేసుకోగా, 6.46 లక్షల గ్యాస్ బండలు…
అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఎఐ
SAKSHITHA NEWS అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యూనివర్సిటీ పై ముఖ్య ప్రకటన చేశారు నారా లోకేష్. ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయి ఎఐ నిపుణులను తయారు చేయడానికి కేంద్రమవుతుందని ఆయన తెలిపారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఆంధ్రప్రదేశ్…