The government will support Srinivasa Rao’s family in all ways.
శ్రీనివాసరావు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది…
ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు కుటుంబానికి రూ.50లక్షల చెక్కు అందజేత.
శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అధికారులు, నాయకులు.
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబొడు ఘటనలో మృతి చెందిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామంకు చెందిన ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రకటించిన రూ.50 లక్షల పరిహారాన్ని వారి కుటుంబానికి అందజేసిన అటవీశాఖ చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సిసిఎస్) భీమా నాయక్,
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డిఎఫ్ఓ సిద్దార్థ విక్రమ్ సింగ్, రంజిత్ నాయక్. శ్రీనివాస రావు భార్య పిల్లలను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఏం భయపడాల్సిన అవసరం లేదని, శాఖ తరుపున అన్ని విధాలుగా సహకరిస్తామని హామి ఇచ్చారు.
శ్రీనివాస రావు మృతి బాధాకరమని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ హామి మేరకు స్ధానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలతో ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా నేడు రూ.50లక్షలు ఇవ్వడం జరిగిందని,
త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఇతర అన్ని హామీలను సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనివాస రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
జోహార్ శ్రీనివాస్ రావు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, నాయకులు ఎంపీపీ మలోత్ గౌరి, తహాసిల్దార్ నర్సింహారావు, ఎఫ్ ఆర్ ఓ రాధిక, మంత్రి పిఎ. సి హెచ్ రవికిరణ్, నాయకులు మందడపు నర్సింహారావు, కుర్రా భాస్కర్ రావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మందడపు సుధాకరర్ తదితరులు ఉన్నారు.