SAKSHITHA NEWS

ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కృషితో సాకారం కానున్న షాదిఖానా..

జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్డు శాంతినగర్ సమీపంలో రూ‌. 75 లక్షలతో నిర్మించే షాదిఖానా శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను , ఉపముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అంజాద్ భాషా పాల్గొంటున్నట్లు పట్టణ ముస్లిం మైనార్టీ సోదరులు తెలిపారు.

ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు మాట్లాడుతూ తాము ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న నుతన షాదిఖానా నిర్మాణం ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కృషితో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడున్న షాదీఖానా చాలా ఇరుకుగా ఉండటంతో వివాహ సందర్భాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. విశాలమైన షాదీఖానా నిర్మాణం విషయాన్ని ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను దృష్టికి తీసుకురావడంతో ఆయన ప్రభుత్వం నుంచి రూ. 75 లక్షలను మంజూరు చేయించారన్నారు. ఈనెల 11న జరిగే కార్యక్రమానికి ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న షాదిఖానా నిర్మాణానికి నెల 11న శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న షాదిఖానా ఇరుకుగా ఉండడంతో నూతనంగా 75 లక్షల రూపాయలతో షాదీఖానా నిర్మిస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. వారి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అలాగే డిప్యూటీ సీయం పదవిని ఇచ్చి వారికి గౌరవం ఇచ్చిందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారని ఉదయభాను విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS