బోదాసు నరసింహ రూపొందించిన ‘కరాళ’ చిత్రం మొదటి పోస్టర్

Spread the love

The first poster of Bodasu Narasimha’s film ‘Karala’

సాక్షిత : సికింద్రాబాద్ లోని మానికేశ్వరి నగర్ ప్రాంతానికి చెందిన బోదాసు నరసింహ రూపొందించిన ‘కరాళ’ చిత్రం మొదటి పోస్టర్ ను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సితాఫలమండీలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ చిత్రం కో ప్రొడ్యూసర్ పిట్ల భాస్కర్, డైరెక్టర్ శ్రినందన్ తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లను బాగా చూసుకోవాలనే ఇతివృత్తంతో చారిత్రక అంశాలను కుడా చేర్చి ఫాంటసి, కమర్షియల్ ఎలెమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో రవి శంకర్, అకంక్ష్, షహర్ అఫాస్ ప్రధాన తారాగణం. ఒత్సాహిక కళాకారులతో, మంచి ఇతి వృత్తంతో రూపుదిద్దుకున్న ‘ కరాళ’ చిత్రం సక్సెస్ కావాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు

Related Posts

You cannot copy content of this page