గిరిజనుల పొడు భూములకు పట్టాలివ్వాలి.

Spread the love

ఆదివాసీ గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులు , పీడీ యాక్ట్ ను ఎత్తివేయాలి.

తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారికి సిపిఎం మంచిర్యాల జిల్లా బృందం వినతి.

మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కోయపోచం గూడెం ఆదివాసీ గిరిజనులు గత కొన్ని సం,ల నుండి పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఆ సందర్బంలో ఫారెస్ట్ శాఖ, పోలీసు శాఖ అక్రమ కేసులు ఆదివాసీ గిరిజనులపై అక్రమ కేసులు బనాయించారు.రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములపై ఆందోళన చేస్తే కోయపోచం గూడెం ఆదివాసీ గిరిజన మహిళలలపై అక్రమ కేసులు పెట్టి వారం రోజులు పాటు ఆదిలాబాద్ జిల్లా జైలు జీవితం గడిపారు.

ఆ పోరాటం ఫలితంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొంతమందికి మాత్రమే పోడు హక్కు పత్రాలు ఇచ్చారు.కానీ ఈ పోరాటానికి మూల కారణమైనా కోయపోచం గూడెం ఆదివాసి గిరిజనుల గ్రామాల పేర్లు మాత్రం పోడు లిస్ట్ లో గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేర్చలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు మాట్లాడిన ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కావున కాంగ్రెస్ ప్రభుత్వం ద్రుష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విదంగా చూసి
కోయపోచం గూడెం ఆదివాసీ గిరిజనుల పోడు భూములకు హక్కు పత్రలు ఇచ్చే విదంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పైళ్ల ఆశయ్య సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు, సంకె రవి జిల్లా కార్యదర్శి, ప్రకాష్, అశోక్, చందు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, దుంపల రంజిత్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు, బాపు కోయపోచం గూడెం ఆదివాసీ గిరిజన నాయకుడు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page