రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకు చేరుకున్న ఎన్నికల *పోలీస్ పరిశీలకులు (అబ్జార్వర్ ) శ్రీ అనుపం శర్మ IPS (డి. ఐ. జీ- హిమాచల్ ప్రదేశ్)ని ఎర్రవల్లి బెటాలియన్ గెస్ట్ హౌస్ నందు పూల మొక్కను అందజేసి జిల్లాకు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ రితిరాజ్ ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్,జిల్లా భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర సరిహద్దుల లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, భద్రతా పరంగా తీసుకుంటున్న అంశాలపై చర్చించడం జరిగింది. మరియు ఇప్పటివరకు జిల్లా నందు పట్టుబడిన అక్రమ సరుకు, డబ్బు, మద్యం, ఎన్నికల సమయంలో కేంద్రబలాగాల వినియోగింపు, సమస్యత్మక ప్రాంతాలు పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
ఎన్నికల పిర్యాదులపై ప్రజలు , పరిశీలకుల (అబ్జర్వర్) ను సంప్రదించవచ్చు
ఈ సంధర్బంగా ఎన్నికల పోలీస్ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటి అనుమానాస్పద అంశం అయిన తమ దృష్టికి వస్తే వాటి పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని శ్రీ అనుపం శర్మ ఐపీయస్ డీఐజీ అన్నారు. అలాగే జిల్లా లోని ఆలంపూర్ , గద్వాల్ నియోజక వర్గాల్లో ఎక్కడైనా ఎన్నికల ప్రభావిత అంశం ప్రజల దృష్టికి, పార్టీల నాయకుల దృష్టికి వస్తె నా మొబైల్ నెంబర్ 6301754688 కు ఫిర్యాదు చేయవచ్చని అలాగే ఏదైనా ఎన్నికల కు సంబందించిన ఫిర్యాదుకై నేరుగా తనని ఎర్రవల్లి 10th బెటాలియన్ గెస్ట్ హౌస్ నందు ఉదయము 10:00 గంటల నుండి 11:00 గంటలవరకు నేరుగా సంప్రదించవచ్చు అనీ అన్నారు.ఈ కార్యక్రమం లో 10వ బెటాలియన్ కమాండెంట్ ఎన్. వి సాంబయ్య, సాయుధ దళ డి. ఎస్పీ శ్రీ ఇమ్మనియోల్, అసిస్టెంట్ కమాండెంట్ సాంబ శివ రావు తదితరులు ఉన్నరు.