కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లలోని ఎనిమిది డివిజన్ లలో చేపట్టబోయే అభివృద్ధి

Spread the love

The development will be undertaken in eight divisions of the twin circles of Quthbullapur

కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లలోని ఎనిమిది డివిజన్ లలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న ఎనిమిది డివిజన్ లలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జోనల్ కమిషనర్ మమత మరియు మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండబ్లూఎస్ఎస్బి, ఇరిగేషన్ శాఖల ఉన్నత అధికారులు, సిబ్బందితో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ బస్తీ, కాలనీల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేపట్టవలసిన మౌలిక సదుపాయాలకు అవసరమయ్యే వ్యయ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైన ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న మెయిన్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, సీఆర్ఎంపీ రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, కమిటీ హాల్లు, కాంపౌండ్ వాళ్ళు, పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్ లు, హెచ్ఆర్డిసిఎల్ రోడ్లు, డ్రైనేజీ ఔట్లెట్ లు, స్మశానవాటికలు, నాలాలు, జంక్షన్ ల అభివృద్ధి, స్టేడియంలు

, ఫెన్సింగ్ ఏర్పాటు, పెండింగ్ లో ఉన్న పెన్షన్లు తదితర అంశాలపై చర్చించి అందుకు ప్రతిపాదనలు వేగవంతంగా సిద్ధం చేయాలన్నారు. త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమై అందుకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు.

అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో జంట సర్కిల్ల డీసీలు మంగతయారు, ప్రశాంతి, ఎస్ఈ చెన్నారెడ్డి, జీఎం శ్రీధర్ రెడ్డి, సీపీ ఉమాదేవి, డిసిపి సాంబయ్య, ఈఈలు కృష్ణ చైతన్య, గోవర్ధన్, డిఈఈలు రూపాదేవి, పాపమ్మ, శిరీష, భానుచందర్, డిజిఎంలు అప్పల నాయుడు, రాజేష్, ఇరిగేషన్ ఏఈ రామారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page