కులగణన చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, బిసి సంక్షేమ సంఘం డిమాండ్

కులగణన చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, బిసి సంక్షేమ సంఘం డిమాండ్

SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 నుంచి 48 శాతానికి పెంచుతామన్న హామీ నెరవేర్చాలని కుల గణన చేపట్టి బిసి లకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, లేదంటే ఎన్నికలను అడ్డుకుంటామని కులగణనపై ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు. మరియు బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే సర్పంచ్ ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎన్నికలు జరపాలని 13 బీసీ సంఘాలు మరియు 30 కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం పెంచాలని 13 బీసీ సంఘాలు, 30 కుల సంఘాలు, డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, సంయుక్త రాష్ట ఆర్గనైజింగ్ సెక్రెటరీ అలిశెట్టి ఈశ్వరయ్య, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రాంచందర్, బిసి సంక్షేమ సంఘం యూత్ కో ఆర్డినేటర్ హృషికేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 05 20 at 15.43.04

SAKSHITHA NEWS