కాంగ్రెస్ నాయకులను ముందస్తు హౌస్ అరెస్టు చేసిన ఆగని ‘దళిత బంధు’ నిరసనలు

Spread the love

పటాన్ చెరు మండలంలో అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని నిరసన ర్యాలీ చేపట్టిన : కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు మండలంలోని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని ఇస్నాపూర్ తేజ కాలనీ నుండి ఇస్నాపూర్ x రోడ్ వరకు మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను ముందస్తు హౌస్ అరెస్టు చేసిన దళిత బంధు నిరసనలు ఆగవాని అన్నారు,

అధికార పార్టీకి చెందిన దళితులకు మాత్రమే దళిత బంధు పథకానికి ఎంపిక చేయడం సరైంది కాదన్నారు, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించే వరకు కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తుందన్నారు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ గడ్డం శ్రీశైలం, శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్స్ వడ్డె కృష్ణ, నర్సింగ్ రావు, అశోక్ ముదిరాజ్,

ఎంపీటీసీలు నరేందర్ రెడ్డి, అంజి రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, సరితా సుధాకర్, సర్పంచులు గడ్డం బాలమణి, పెంటయ్య, ఉప సర్పంచులు శోభక్రిష్ణ రెడ్డి, శ్రీశైలం, రంజినికాంత్, నాయకులు రాధా క్రిష్ణ, శ్రీహరి, రాజి రెడ్డి, శివానందం, భుజంగారెడ్డి, రవీందర్ రెడ్డి, విక్రమ్ గౌడ్, గోరె మియా, అశోక్, గోపాల క్రిష్ణ, రాష్ట్ర ఎస్ సి సెల్ కన్వీనర్ నరసింహ, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ఛైర్మెన్ హబీబ్ జానీ, సంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు ప్రవీణ్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ యాదవ్, నందీశ్వర్ రెడ్డి, వెంకట్ గౌడ్, యాదగిరి, మహేందర్, సిఎచ్ మల్లేష్, రాంచందర్ రెడ్డి, మహేందర్, ప్రవీణ్, మాధవ్ రెడ్డి, భవాని గౌడ్, రాములు, భూపాల్ గౌడ్, మన్నె లక్ష్మి, నాగరాజు, రామచంద్ర రెడ్డి, శ్రీకాంత్, బల్వంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, శంకర్, శ్రీనివాస్, భాస్కర్, సుభాష్, మహేష్, శ్రీను, రమేష్ రెడ్డి, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్, టౌన్ ప్రెసిడెంట్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page