SAKSHITHA NEWS

అంగన్వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ అంగన్వాడీ వర్కర్స్& హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీలు 19 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోవడంతో శ్రీకాకుళంలో భారీ ఎత్తున అంగన్వాడీలు రెవెన్యూ మంత్రి ధర్మాన.ప్రసాదరావు ఇంటిని ముట్టడించారు. ఇంటి వద్ద లేకపోవడంతో ఆయన వచ్చే వరకూ ఆందోళన కొనసాగించారు. అంగన్వాడీలు వద్దకు వచ్చిన రెవెన్యూ మంత్రి ధర్మాన.ప్రసాదరావు ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేసిందని చెప్పగా అంగన్వాడీలు మాకు న్యాయం చేయలేదని ఇచ్చిన హామీ అమలు చేయలేదని చెప్పారు.

అంగన్వాడీల కోర్కెలు సమంజసమైనవని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని తెలియజేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి గారి మాటలు భరోసా కల్పించలేదని, నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదని తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె పోరాటం కొనసాగుతుందని సృష్టం చేసారు. జనవరి 3న ఛలో కలెక్టర్ కార్యాలయం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సిఐటియు జిల్లా నాయుకులు అల్లు.సత్యన్నారాయణ, కె.సూరయ్య ఎపి అంగన్వాడీ వర్కర్స్& హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, నాయుకులు పి.లతాదేవి, జె.కాంచన, కె.సుజాత, శాంతామణి, మాధురి, లక్ష్మీ, హేమ, సరోజిని, భాగ్యలక్ష్మీ, జ్యోతి, రాణి, ఎమ్.శారద, రాజేశ్వరి, జ్యోతిలక్ష్మి, భూలక్ష్మీ, కనకం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 30 at 11.50.05 AM

SAKSHITHA NEWS