హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి. శ్వేతపత్రంపై చర్చ అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఫిబ్రవరి 8 నుంచి 17వరకు 8 రోజులు సమావేశాలు జరిగాయి. ఈ నెల 8న గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పదో తేదీన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను పెట్టింది. కులగణనపై ఈ నెల 16న తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. శనివారం నీటిపారుదల రంగంపై శ్వేతపత్రంపై చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు సాగాయి….
బడ్జెట్ సమావేశాలు శనివారం రాత్రి ముగిశాయి
Related Posts
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
SAKSHITHA NEWS మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో ప్రైస్ మీట్.. ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్,రామచంద్రు నాయక్ కామెంట్స్… రేపు మహబూబాబాద్ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటను అడ్డుకొని తీరుతాం. .. మెడికల్ కళాశాలకు…
వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం
SAKSHITHA NEWS వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ ఖమ్మం : కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేస్తున్న ధర్నాకు సంఘీభావం మందకృష్ణ మాదిగ తెలిపారు . ఈ సందర్భంగా…