చచ్చిపోయిన బి ఆర్ ఎస్, ఉనికే లేని బి జే పి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి పోటీయే కాదు :
ఉమ్మడి శామీర్ పేట్ మండల కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి
రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం లో గెలుపే లక్ష్యంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి శామీర్ పేట్ ( శామీర్ పేట్,మూడు చింతల పల్లి, తూంకుంట) మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఈరోజు నియోజకవర్గ ఇంఛార్జ్,టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి, పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత రెడ్డి, మాజీ మంత్రి,ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ చచ్చిపోయిందని,బి జే పి పార్టీకి మల్కాజ్ గిరి నియోజకవర్గం లో ఉనికే లేదని, ఆ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి పోటీయే కాదని, నాయకులు బూత్ స్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీని విజయపథంలో నడపాలని,కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి ప్రభుత్వంలో పార్టీలో తగిన గౌరవం లభించేలా చూసే బాధ్యతను మేం తీసుకుంటామని చెప్పారు.ఈ సమావేశంలో ఏ బ్లాక్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి, శామీర్ పేట్, తూంకుంట, మూడు చింతలపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి, యాష్కీ శంకర్ గౌడ్,బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్,టిపిసిసి జనరల్ సెక్రటరీ గోగుల సరిత, గజ్వేల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గోనె మహేందర్ రెడ్డి,కార్పోరేటర్ తోటకూర అజయ్ యాదవ్, జవహర్ నగర్ మేయర్ శ్రీమతి శాంతి కోటేష్ గౌడ్, రాపోలు రాములు, మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డి మరియు ఉమ్మడి శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు