The authorities failed to stop the sand mafia under the ruling party.
*అధికార పార్టీ అండతోనే ఇసుకమాఫియా… అడ్డుకోవడం లో అధికారులు విఫలం.
*రమేశ్ కుమార్ ,
జిల్లా ప్రధానకార్యదర్శి*
బషీరాబాద్ మండలం లోని ఇందర్ చెడ్ స్వయానా రోహిత్ రెడ్డి గ్రామం లో అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో
ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా బషీరాబాద్ పి ఎస్ కు చెందిన శంకర్ అనే జవాన్ పెట్రోలింగ్ లొ భాగంగా ట్రాక్టర్ ను అప బోతుండగా , ట్రాక్టర్ ను ఆపకుండా జవాన్ ను గుద్దడంతో రెండు కాళ్ళు విరిగినట్లు సమాచారం తెలిసి రమేశ్ కుమార్ అధికార పార్టీ పై మండిపడ్డారు.
గత కొన్నిరోజులుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న విషయం పట్ల బీజేపీ పార్టీ ,సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరును ఖండించారు.
అక్రమ ఇసుక ఈ ప్రాంతంలో MLA అండతోనే ఆయన బంధువులు ఇదంతా నడిపిస్తున్నారని …!! ఇసుకమాఫియాను అడ్డుకోవడం లో అధికారులు భయపడుతున్నారా..!!!.లేక ఈ వ్యవారంలో వారికి ఏమైనా ముడుపులు అందుతున్నాయా!!! అనే అనుమానాలు వ్యక్తంచేశారు .
ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి ఇసుక అక్రమరవాణా చేసి కోట్లరూపాయల సంపదను కొల్లగొడుతున్న వారిని చట్టపరమైనచర్యలుతీసుకోవాలని అదేవిధంగా ఈ సంఘటనలో తీవ్ర గాయాల పాలయిన కానిస్టేబుల్ ను ఆదుకోవాలని వారికి న్యాయం చేయాలని రమేశ్ కుమార్ డిమాండ్ చేశారు.