SAKSHITHA NEWS

The aim of the government is to improve the standard of living of the people.

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం…

గాజులరామారం డివిజన్ లో రూ.15.95 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీల్లో రూ.15.95 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవాలు మరియు శంఖుస్థాపనలు చేశారు.

మొదటగా శ్రీరామ్ నగర్ లో రూ.10.00 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న కమిటీ హాల్ పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం శ్రీరామ్ నగర్ కాలనీలో రూ.42.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఎన్టీఆర్ నగర్ లో రూ.49.00 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

చంద్రగిరి నగర్ లో రూ.1.20 కోట్లతో నూతనంగా చేపడుతున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. హెచ్ఏఎల్ కాలనీ ఈస్ట్ లో రూ.48.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. శ్రీ వెన్ ఎంక్లేవ్ లో నూతనంగా అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించారు.

చిత్తారమ్మ ఆలయం వద్ద రూ.1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు. రూ.6 కోట్లతో హెచ్ పీ గ్యాస్ గోదాం నుండి బంధం చెరువు వరకు వర్షపు నీటినాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గాజులరామారంలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ షటిల్ కోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. లాల్ సాబ్ గూడ గ్రామం నుండి బాచుపల్లి రోడ్డు వరకు రూ.1.98 కోట్లతో నూతనంగా చేపడుతున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

లాల్ సాబ్ గూడలో రూ.89 లక్షలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. కట్ట మైసమ్మ బస్తిలో రూ.49.50 లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సిసి రోడ్లను ప్రారంభించారు. రూ.89 లక్షలతో ఆర్కె లేఅవుట్ మరియు విష్ణుప్రియ ఎంక్లేవ్ లలో నూతనంగా చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే విధంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

కొత్తగా వెలసిన బస్తీలు, కాలనీల్లో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. కోట్ల నిధులు వెచ్చించి అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంను అన్ని రంగాల్లో నెంబర్ గా నిలుపుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఈఈ రూపాదేవి, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, ఇంద్రసేన గుప్త, కస్తూరి బాల్ రాజ్, పెద్దబాల్ అంజన్ గౌడ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, హుస్సేన్, ఆబిద్, సింగారం మల్లేష్, మసూద్, ఇబ్రహీం, చందు ముదిరాజ్, దిలీప్, ఇమ్రాన్ బైగ్, హమీద్, సమ్మయ్య, తారా సింగ్, మూసాఖాన్, చెట్ల వెంకటేష్, నర్సింహా, మహిళా అధ్యక్షురాలు సంధ్యా రెడ్డి, సుజాత, ఫర్జానా బేగం మరియు వివిధ బస్తీల సంక్షేమ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS