బాపట్ల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం, మీ మాట – నా బాట కార్యక్రమం లో భాగంగా నేడు కర్లపాలెం మండలం లోని పేరలి గ్రామంలో మల్లెలవారి పాలెం లో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధానాలను వివరిస్తూ మహిళలకు ప్రాధాన్యత ను ఇస్తూ వారికి చీర,నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురుంచి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు.
ముందుగా పేరలి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, తదనంతరం గ్రామస్తులు పూలతో,బాణచాంచ లతో ఘన స్వాగతం పలుకగా పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి కోలాహలంగా సాగిన భారీ ర్యాలీగా వెళ్లి కార్యక్రమం ప్రారభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ ..
నేను కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు 3000 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నాను.
నా కృషిని గుర్తించి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చిన తరువాత అందరిని కలుపుకుని కార్యక్రమాలు చేపడుతూ రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాను. ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేస్తూ ఒక అన్నగా, తమ్ముడిగా ఆడపడుచులకు చిరు కానుక ను అందిస్తూ ముందుకు సాగుతున్నాం. నన్ను మీ కుటుంబ సభ్యుడిలా భావించి అవకాశం ఇవ్వండి కలిసి బాపట్ల ను అభివృద్ధి చేసుకొందాం. పెరలి గ్రామం అంటే తెలుగుదేశం అడ్డాగా చేసుకునేలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలి. గ్రామ పార్టీ బాధ్యతలు యువ నాయకుల చేతిలో పెట్టీ సీనియర్ నాయకులు వారి వెనుక ఉండి సరైన మార్గదర్శనం చేయాలి.
వైసీపీ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా దళితులకు చాలా అన్యాయం జరిగింది. వారికి రావాల్సిన చాలా సంక్షేమ పథకాలు నిలిపివేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెరలి గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి అండగా నిలుస్తున్నామని నరేంద్ర వర్మ గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల, పేరలి గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.